వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుందని రస్మిక ?

లక్కంటే రస్మికదే. చాలా ఫాస్ట్ గా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ‘ఛలో’ సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది. ‘గీత గోవిందం’తో మేజిక్ చేసింది. దేవ’దాస్’కు సరిజోడి అనిపించుకొంది. డియర్ ‘కామ్రేడ్ తో రొమాన్స్ చేసింది’. జులై 26న డియర్ కామ్రెడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కున్న మహేష్ సినిమాలో రస్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో రస్మిక రేంజ్ యే మారిపోనుంది.

అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినా స్టార్‌ నాయికగా ఎదిగారు కదా, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుందని అడిగితే ‘‘ఇది నా జీవితమేనా లేక, వేరొకరి జీవితంలోకి నేనొచ్చానా అనిపిస్తుంది. చిన్నప్పుడు మా ఊరు నుంచి బెంగళూరుకి రావడమే పెద్ద విషయం నాకు. అక్కడ చదువుకోవాలనేది నా కల. అది తీరడంతోపాటు అనుకోకుండా సినిమా అవకాశం కూడా లభించింది. స్టార్‌ అనే గుర్తింపుపై నమ్మకం లేదు కానీ.. ఇన్ని చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ బిజీగా గడపడం లాంటి విషయాలు గుర్తుకొచ్చిన ప్రతిసారీ ఆశ్చర్యంగా ఉంటుంది. మొదట్లో సినిమా నా జీవితంలో ఓ భాగం అనుకొనేదాన్ని, ఇప్పుడు సినిమానే జీవితం అనిపిస్తోంద’’ని చెప్పుకొచ్చింది రస్మిక.