‘సాహో’ దెబ్బకు రికార్డులన్నీ బద్దలు


బాహుబలి సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేశాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులని ఆకట్టుకొన్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో కూడా అదే రేంజ్ లో ఉంది. శుక్రవారం సాహో టీజర్ విడుదలైంది. రికార్డులన్నీ బద్దలు కొడుతూ.. కొత్త చరిత్రని సృష్టిస్తోంది సాహో టీజర్. విడుదలైన 24గంటల్లో 60మిలియన్స్ పైగా వ్యూస్ సొంతం చేసుకొంది.

1.3మిలియన్స్ పైగా యూట్యూబ్ లైకులు, 4.5మిలియన్స్ పైగా సోషల్ మీడియా లైక్స్, సోషల్ మీడియా ఇంటర్ యాక్షన్స్ వచ్చాయి. 76మిలియన్స్ పైగా సోషల్ మీడియా సెర్చ జరిగింది. మొత్తంగా.. మరో భారతీయ సినిమా టీజర్ దక్కని స్పందనని సాహో టీజర్ సొంతం చేసుకొంది. టీజర్ హవానే ఈ రేంజ్ లోనే ఉంటే సినిమాకు ఇంకే రేంజ్ లో రెస్పాన్స్ ఉంటుందనేది చూడాలి.

సుజీత్ దర్శకత్వంలో సాహో తెరకెక్కుతోంది. ప్రభాస్ కి జోడీగా శ్రద్దాకపూర్ నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ని దాదాపు రూ. 300కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.