కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి బెదిరింపు కాల్స్‌

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సైబర్‌ క్రైమ్‌ పోలీసులని ఆశ్రయించారు. తనకి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. గత నెల 20న ఇంటర్నెట్‌ వాయిస్‌ కాల్స్‌ ద్వారా బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. 69734063 నంబర్‌ నుంచి అజ్ఞాత వ్యక్తులు కాల్‌ చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని మంత్రి హైదరబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కిషన్ రెడ్డి.. హైదరాబాద్ ఉగ్రవాదులకి అడ్డగా మారిందని, దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా.. ఆ మూలాలు హైదరాబాద్ లోనే తేలుతున్నాయని అన్నారు. హైదరాబాద్ నుంచి ఉగ్రవాదులని ఏరిపారేయాలన్నారు. దీనిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసరుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి మాటలు హైదరాబాద్ బ్రాండ్ ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది.