వాట్సాప్ కొత్త నిబంధనలు.. అతిక్రమిస్తే చర్యలు తప్పవ్ !


ఇకపై వాట్సాప్ లో బల్క్ సందేశాలు ఒకేసారి పంపడానికి వీల్లేదు. ఈ మేరకు వాట్సాప్ యాజమాన్యం కొత్త నింబంధలని తీసుకొచ్చింది. గుంపుగా అనేక మందికి ఒకేసారి సందేశాలు పంపినా జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని వాట్సాప్‌ ఓ ప్రకటన చేసింది. అపడేట్ చేసిన తన వాట్సాప్‌ పాలసీలో ఈ కొత్త నిబంధనలను చేర్చింది. సంస్థలు కానీ, వ్యక్తులు కానీ ఇలా సందేశాలు పంపితే డిసెంబరు 7 నుంచి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దానిలో పేర్కొంది. అయితే కంపెనీ తీసుకొనే చట్టపరమైన చర్యలు ఏంటో మాత్రం స్పష్టం చేయలేదు. భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన వాట్సాప్ కు 200 మిలియన్ల యూజర్లు ఉన్నారు.