‘సాహో’ టీజర్ పై స్వీటీ కామెంట్స్


సాహో టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. అత్యధిక వ్యూస్‌ సాధించిన టీజర్‌గా రికార్డు సృష్టించింది. 24గంటల్లో 60మిలియన్స్ పైగా వ్యూస్ సొంతం చేసుకొంది. యూట్యూబ్ లో ట్రెడెంగ్ నెం.1గా కొనసాగుతోంది. సినీ ప్రముఖులు, విమర్శకులు టీజర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. స్వీటీ అనుష్క కూడా సాహో టీజర్ పై స్పందించారు. ‘‘సాహో’ టీజర్‌ పూర్తిగా చాలా నచ్చింది. యూవీ క్రియేషన్స్‌, ప్రభాస్‌, సుజీత్‌.. మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు. సినిమా కోసం ఎదురుచూస్తున్నా’నని రాసుకొచ్చింది.

ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముకేష్‌, మందిరా బేడీ, వెన్నెల కిశోర్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో సాహో పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఐతే, వాటిని అందుకొనేలా సాహో టీజర్ అనిపించింది. హాలివుడ్ రేంజ్ లో ఉంది.