రొమాన్స్’లో హీరోయిన్ బాగా.. సహకరించింది !


అర్జున్, విజయ్‌ ఆంటోని కలిసి నటించిన తమిళ చిత్రం “కొలైగారన్‌”. తెలుగులో ‘కిల్లర్’ గా విడుదల చేశారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కిల్లర్’ హిట్ టాక్ సొంతం చేసుకొంది. మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం చిత్రబృందం చెన్నైలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు శశి, అర్జున్, విజయ్‌ ఆంటోని, అషిమా నర్వాల్, సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ మిల్టన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. “ఈ చిత్రం విజయానికి ముఖ్యకారణం యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌. ఆయన చిటికెన వేలితో విజయాన్ని అందించారన్నారు. విజయ్‌ ఆంటోనికి నటన సరిగ్గా రావడం లేదు, ప్రధానంగా రొమాన్స్‌ సన్నివేశాలను పండించలేక పోతున్నారని కామెంట్స్ వినిపించేవి. అందుకే ఈ సినిమాలో అషిమాతో చాలా క్లోజ్‌గా నటించా. ఆమె బాగా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఆమె సహకారంతోనే ఇంతలా రొమాన్స్‌ చేయగలిగా”నన్నారు విజయ్ అంటోనీ.