ఆసీస్’దే విజయం


శ్రీలంకపై ఆస్ట్రేలియా నెగ్గింది. శనివారం శ్రీలంకతో జరిగిన పోరులో ఆస్ట్రేలియా 87పరుగుల తేడాతో భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. మొదటి బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 50ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 334పరుగులు చేసింది. కెప్టెన్‌ ఫించ్‌ (153; 132బంతుల్లో 15×4, 5×6) అద్భుత శతకంతో చెలరేగాడు. స్మిత్‌(73; 59బంతుల్లో 7×4, 1×6), మాక్స్‌వెల్‌(46; 25బంతుల్లో 5×4, 1×6) రాణించారు. లంక బౌలర్లలో ఉడాన, ధనుంజయ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

334పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శీలంక ఆరంభంలో బాగానే ఆదింది. ఓపెనర్లు ఓపెనర్లు కరుణరత్నె(97; 108బంతుల్లో 9×4), కుశాల్‌ పెరీరా(52; 36బంతుల్లో 5×4, 1×6) రాణించారు. ఐతే, ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ ఎవ్వరూ రాణించలేదు. దీంతో ఉత్కంఠ ఫలితం వస్తుందనుకొన్న మ్యాచ్ వన్ సైడ్ అయింది. స్టార్క్‌(4/55), రిచర్డ్‌సన్‌(3/47), కమిన్స్‌(2/38) ధాటికి లంక 45.5 ఓవర్లలో 247పరుగులకే ఆలౌటైంది.