ఆసీస్ (334/7)కు లంక (106/0 14ఓవర్లు) ధీటైన జవాబు

వరల్డ్ కప్ లో భాగంగా నేడు ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచ్ జరుగుతోంది. మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 334పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ (153; 132 బంతుల్లో 15×4, 5×6), స్టీవ్‌ స్మిత్‌ (73; 59 బంతుల్లో 7×4, 1×6) చెలరేగి ఆడారు. స్టీవ్‌ స్మిత్‌తో కలిసి మూడో వికెట్‌కు ఫించ్‌ 173 పరుగుల భారీ భాగస్వామ్యం అందించాడు. ఆఖర్లో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (46*; 25 బంతుల్లో 5×4, 1×6) అదరగొట్టాడు. లంక బౌలర్లలో ఉడాన, ధనంజయ చెరో రెండు వికెట్లు తీశారు.

335 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిలకడగా ఆడుతోంది. 14ఓవర్లు పూర్తయ్యేవరకు వికెట్ నష్టపోకుండా 106 పరుగులతో ఆటని కొనసాగిస్తోంది. కుశాల్‌ పెరీరా(50), కరుణరత్నె(52) అర్థశతకాలు పూర్తి చేశారు. ఇదే విధంగా లంక బ్యాట్స్ మెన్స్ నిలకడగా ఆడితే.. కంగారులని మట్టికరిపించే అవకాశాలున్నాయి. ఐతే, ఏ చిన్ని అవకాశం దక్కిన ఆసీస్ మ్యాచ్ ని తన చేతిలోకి తీసుకుంటుంది. మరీ.. ఆ ఛాన్స్ ఇవ్వకుండా లంక లక్ష్యాన్ని చేధిస్తుందేమో చూడాలి.