బిగ్ బాస్3 ప్రోమో చూశారా.. ?

బిగ్ బాస్3కి రంగం సిద్ధం అవుతోంది. హోస్ట్ గా కింగ్ నాగార్జున ఫిక్స్ అయ్యారు. దాంతో కంటెస్టర్స్ ని ఫైనల్ చేసే పనిలో బిగ్ బాస్ యాజమాన్యం ఉంది. ఈ క్రమంలో చాలా మంది పేర్లు తెరపైకి వస్తున్నాయ్. రేణు దేశాయ్, యాంకర్ శ్రీముఖి, హీరో వేణు, కెఎ పాల్, బండ్ల గణేష్ తదితర పేర్లు వినిపించాయ్. ఐతే, ఎవరెవరు ఫైనల్ అయ్యారన్నది తెలియాల్సి ఉంది. తాజాగా, బిగ్ బాస్ 3 ప్రోమో ని స్టార్ మా విడుదల చేసింది. బిగ్ బాస్ లోగోతో కూడిన వీడియోతో త్వరలోనే బిగ్ బాస్3 షో ప్రారంభం కానుందని ప్రోమోలో చూపించారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1 సూపర్ హిట్ అయింది. రికార్డు స్ఠాయిలో టీఆర్పీ రేటింగ్స్ ని సొంతం చేసుకొంది. ఇక, బిగ్ బాస్ సీజన్ 2కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. షోని మరోస్థాయికి తీసుకెళ్లకున్నా.. క్రేజ్ తగ్గకుండా నడిపించారు. సీజన్ 3 కోసం వెంకీ, నాగార్జున పేర్లు వినిపించాయి. ఫైనల్ గా నాగ్ ఫిక్సయ్యారు. తాజా ప్రోమోలోనూ హోస్ట్ గా నాగ్ ఫిక్సయినట్టు చూపించలేదు. దానికోసం స్పెషల్ ప్రోమో డిజైన్ చేస్తారేమో.. !