కామ్రేడ్ రిపేర్లు ఇంకా పెండింగ్ లోనే !
కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. మే31న డియర్ కామ్రేడ్ జులై 26కి వాయిదా పడింది. ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. రషెస్ చూశాక.. రిషూట్ కి ప్లాన్ చేశారు. అందుకే సినిమాని వాయిదా వేశారు కూడా. ఐతే, ఆ రిపేర్లు పనులు ఇంకా మొదలు కాలేదు. జులై 26న విడుదల తేదీ అయితే ప్రకటించారు కానీ షూటింగ్ మాత్రం ఇంకా బ్యాలెన్స్ వుండడంతో రిలీజ్ డేట్ మారుతుందా అనే డౌట్స్ వస్తున్నాయి.
టీజర్ తో సినిమా పట్ల ఆసక్తి పెంచేశారు. టీజర్ లో విజయ్ – రస్మిక లిప్ లాక్ సీన్ అదిరిపోయింది. ఈ ఒక్క సీన్ చాలు సినిమా ప్రమోషన్స్ కోసం అన్నట్టుగా ఉంది. అలాగే ఇంతవరకు విడుదల చేసిన రెండు పాటలు కూడా క్లిక్ అయ్యాయి. దక్షిణాదిన అన్నీ బాషల్లో డియర్ కామ్రేడ్ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలోనే రిస్క్ తీసుకోవడం లేదు. రీషూట్స్ ని చేసిన తర్వాతే సినిమాని విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో కామ్రేడ్ మరోసారి వాయిదా పడిన ఆశ్ఛర్యపోవాల్సిన పనిలేదేమో.. !