జగన్’ని కలిసిన చంద్రబాబు మిత్రుడు

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఢిల్లీలోని ఏపీ భవన్ కి వచ్చిన కుమారస్వామి జగన్ తో చర్చలు జరిపారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై ఈ సందర్భంగా చర్చించినట్టు తెలుస్తోంది. వివాదాలని పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సమస్యలు పరిష్కరించుకొన్న తరహా.. కర్ణ్నాటక-ఏపీ రాష్ట్రాల మధ్య సమస్యలని పరిష్కరించుకోవాలని అనుకొన్నట్టు తెలిసింది.

కర్ణాటక సీఎం కుమారస్వామి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేతకు మంచి మిత్రుడని చెబుతుంటారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు జేడీయూ గెలుపు కోసం కృషి చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటకకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు చంద్రబాబు. తెలుగువారు ఎక్కవగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ ఓట్లకి గండికొట్టారు. ఆ తర్వాత కేంద్రంలో మహాకూటమి ఏర్పాటులోనూ కుమారస్వామి చంద్రబాబుతో జట్టుకట్టాలని చూశారు. కానీ, పరిణామాలు వేరేగా మారడంతో వర్కవుట్ కాలేదు. ఇప్పుడు చంద్రబాబు మిత్రుడు, కర్ణాటక సీఎం కుమార స్వామి ఏపీ సీఎం జగన్ తో బేటీ కావడం ఆకట్టుకుంటోంది.