కొత్త సచివాలయం శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్

ప్రస్తుతం ఉన్న సచివాలయ ప్రాంగణంలోనే నూతన భవనాలను నిర్మించే అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో శంకుస్థాపన చేసే అవకాశాలున్నాయి. సచివాలయ నిర్మాణానికి 2016లోనే ముంబయికి చెందిన ఆర్కిటెక్ట్‌ సంస్థ భవన నమూనాలను రూపొందించింది. ఎర్రమంజిల్‌లో రహదారులు-భవనాల శాఖ పాత భవనాల ప్రాంగణంలో శాసనసభ మందిరాన్ని నిర్మించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై త్వరలోనే సీఎం కేసీఆర్‌ సమీక్షించనున్నట్లు సమాచారమ్.

ముందుగా సికింద్రాబాద్‌లోని బైసన్‌ పోలో ప్రాంగణంలో సచివాలయాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావించారు. ఐతే, ఇప్పుడా నిర్ణయాన్ని ఉపసంహరించుకొన్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం చోటే కొత్త నిర్మాణాలు చేపట్టనున్నారు. సచివాలయంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేటాయించిన భవనాలను తెలంగాణకు ఇచ్చేందుకు ఆ ప్రభుత్వం అంగీకరించింది. భవనాలను సైతం ఖాళీ చేసే పనులను చేపట్టింది. సచివాలయంలోని అన్ని భవనాలను కూల్చి వేసిన తరువాత కొత్త సచివాలయం నిర్మాణ పనులు చేపట్టనున్నారు.