‘విరాటపర్వం’ ఫస్ట్ లుక్

వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. సాయిపల్లవి కథానాయిక. శనివారం ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. విక్టరీ వెంకటేష్ క్లాప్ నివ్వగా.. గొట్టిపాటి రవి కెమెరా స్వీచాన్ చేశారు. ఐతే, ఈ కార్యక్రమానికి రానా, సాయిపల్లవి ఇద్దరు హాజరుకాలేదు. సినిమా ప్రారంభం అయిన రోజునే రెగ్యూలర్ షూటింగ్ కూడా మొదలైంది. తాజగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. ‘విరాటపర్వం’ Begins!!Revolutions is an act of love‘ అని పోస్టర్ పై రాసి ఉంది. బ్యాక్ గ్రౌండ్’లో యుద్ధ నేపథ్యం కనిపిస్తోంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో కనిపిస్తారట. విరాటపర్వంలో ప్రియమణి కూడా ఉంది. ఆమె పాత్రని తెలంగాణ జానపద గాయని బెల్లి లలిత స్పూర్తితో తీర్చిదిద్దాని చెబుతున్నారు. హీరోయిన్ సాయిపల్లవి డీగ్లామర్ పాత్రలో కనిపించనుంది. నక్సలైట్ పాత్రలో ఆమె కనిపిస్తారని చెబుతున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలని చిత్రబృందం త్వరలోనే తెలియజేసే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.