రోహిత్ 100 (85బంతుల్లో)

పాక్ తో మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకొన్నాడు. 34 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తి చేసిన రోహిత్.. 85 బంతుల్లో 100 పరుగులు చేశాడు. అద్భుతమైన షాట్స్ అలరించాడు. రోహిత్ ఆటని చూస్టే.. మైదానంలో సచిన్ టెండూల్కర్ ఆడుతున్నట్టు కనిపించింది. సచిన్ స్టయిల్ లో రోహిత్ కొట్టిన హుక్ షాక్ హలైట్ గా నిలిచింది.

ప్రసుతం టీమిండియా 172/1 (30ఓవర్లలో) ఆటని కొనసాగిస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ9 (17బంతుల్లో) రోహిత్ కి మంచి సహకారం అందిస్తున్నాడు. టీమిండియాకు ఇంకా 8 వికెట్లు ఉండటంతో భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. బౌలింగ్ లోనూ రాణిస్తే.. టీమిండియా ఈజీగా విన్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే జరిగితే.. వరల్డ్ కప్ లో పాక్ పై భారత్ విజయాల పరంపర రికార్డు కొనసాగినట్టే.