థమన్ కాదు జిబ్రాన్’ని తీసుకొన్నారు


‘సాహో’ సినిమా సంగీత బాధ్యతల నుంచి బాలీవుడ్‌ త్రయం శంకర్‌ ఎహ్‌సాన్‌ లాయ్‌ తప్పుకొన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ‘సాహో’ కోసం సంగీత దర్శకుడి వేట సాగుతూనే ఉంది. థమన్, జిబ్రాన్ పేర్లు వినిపించాయి. ఫైనల్ గా జిబ్రాన్‌ని తీసుకున్నారు.
‘రన్‌ రాజా రన్‌’, ‘విశ్వరూపం’, ‘జిల్‌’ లాంటి చిత్రాలకు సంగీతం అందించారు జిబ్రాన్‌. ‘సాహో చాప్టర్‌ 1’, ‘సాహో చాప్టర్‌ 2’ ప్రచార చిత్రాలకూ జిబ్రానే నేపథ్య సంగీతం ఇచ్చారు. ఇప్పుడు ‘సాహో’ చిత్రానికీ ఆయనే నేపథ్య సంగీతం అందివ్వనున్నారు.

‘‘యాక్షన్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. నేపథ్య సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంది. జిబ్రాన్‌ ఈ విషయంలో సిద్ధహస్తుడు. అందుకే ఆయన్ని ఎంచుకుంది సాహో చిత్రబృందం. ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు. ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ని దాదాపు రూ. 300కోట్ల బడ్జెట్ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఆగస్టు 15న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.