89పరుగుల తేడాతో పాక్ పై భారత్ గెలుపు


ప్రపంచకప్‌లో దాయాది పాకిస్థాన్‌పై భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటికే 6 సార్లు ఓడించింది. ఆ రికార్డుని కొనసాగిస్తూ.. ఏదోసారి కూడా గెలిచేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాక్ పై భారత్ 89పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ(140; 113బంతుల్లో 14×4, 3×6) శతకంతో, కోహ్లీ (77; 65 బంతుల్లో 7×4), కేఎల్‌ రాహుల్‌ (57; 78 బంతుల్లో 304, 2×6) రాణించారు.

336 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 35 ఓవర్లకు 166/6తో నిలిచింది. ఆ సమయంలో వర్షం కురిసింది. దీంతో 40ఓవర్లకు కుదించారు. దీంతో పాకిస్థాన్ విజయానికి 5 ఓవర్లలో 136 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే 40 ఓవర్లు పూర్తయ్యే సరికి పాకిస్థాన్ 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు మాత్రమే చేయడంతో 89 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టీమిండియా బౌలర్లు విజయ్‌ శంకర్‌, హార్దిక్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.