రాజమౌళి నుంచి నిరాశ

‘ఆర్ఆర్ఆర్’.. స్వతంత్ర ఉద్యమంనాటి కథ. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల జీవితకథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. వీరిద్దరి జీవితాల్లో ఓ ఉమ్మడి పాయింట్ ని రాజమౌళి కథగా ఎంచుకొన్నాడు. అల్లూరిగా రామ్ చరణ్, ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. కొమరం భీమ్ గా ఎన్ టీఆర్ గా నటిస్తున్నారు. ఆయన పక్కన హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు.

స్వతంత్ర ఉద్యమంనాటి కథ కావడంతో.. ఆగస్టు15న ఆర్ఆర్ఆర్ నుంచి ఏదైనా లుక్ వస్తుందని అంతా ఊహించారు. కానీ అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. తన సినిమాకు సంబంధించి ఆగస్ట్ 15న ఎలాంటి స్టిల్ రిలీజ్ చేయడం లేదని స్వయంగా రాజమౌళి ప్రకటించాడు. ఆగస్టు15న ప్రభాస్ ‘సాహో’ విడుదల కానుంది. ఈ సినిమా థియేటర్స్ లో ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ ని ప్రమోట్ చేస్తే.. బాగుణ్ను అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఐతే, రాజమౌళి నుంచి నిరాశ తప్పలేదు.