‘ఆర్ఆర్ఆర్’ నైజాం రేటెంతో తెలుసా ?


ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి రెడీ చేస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. వచ్చే యేడాది జులై30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, ఇప్పటి నుంచే ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ మొదలైంది. ఇప్పటికే ఓవర్సీస్ రైట్స్ అమ్ముడుపోయాయ్. రూ. 63కోట్లు పలికాయి. తాజాగా నైజాం రైట్స్ విషయంలోనూ ఓ ఫిగర్ తెరపైకి వచ్చింది. నైజాం వాల్యూ 70 నుంచి 80 కోట్ల రేంజ్ లో వుంటుందని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే దిల్ రాజు, ఏషియన్ సునీల్ ప్రయత్నాలు సాగిస్తున్నారు.

బాహుబలి బేస్ చేసుకొనే ‘ఆర్ఆర్ఆర్’ రైట్స్ అడుగుతున్నారు. బాహుబలి 2 నైజాం 70 కోట్ల మేరకు వసూలు చేసింది. ఇప్పుడు రేట్లు, మల్టీ ఫ్లెక్స్ లు పెరిగాయి. ‘మహర్షి’ సినిమాతో ప్రభుత్వం కూడా రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో బాహుబలి 2కి ఓ ఐదు పది ఎక్కువగా ఆర్ ఆర్ ఆర్ నైజాం రైట్స్ అమ్ముడుపోయే ఛాన్స్ ఉంది. ఒక్క నైజాం నే 80 కోట్లు అంటే.. తెలుగు రాష్ట్రాల హక్కులే 200 కోట్లకు పైగా వుంటాయన్నమాట. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 400కోట్ల బడ్జెట్ తో డిడివి దానయ్య నిర్మిస్తున్నారు. ఐతే, ప్రీ రిలీజ్ బిజినెస్ దగ్గర దగ్గరగా రూ. 1000కోట్లు జరిగేలా కనిపిస్తోంది.