వీహెచ్ అరెస్ట్


మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, హర్షకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ నేతలతో పాటు వివిధ సంఘాల నాయకులు యత్నించారు. లారీలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని తీసుకొచ్చారు కూడా. ఐతే, వీరి ప్రయత్నాలని పోలీసులు అడ్డుకొన్నారు. వీహెచ్‌, హర్షకుమార్‌తో పాటు అంబేడ్కర్‌ విగ్రహ పరిరక్షణ సమితి అధ్యక్షుడు గుడిమల్ల వినోద్‌కుమార్‌ను అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా తెరాస, బీజేపీలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే 12మంది ఎంపీలు తెరాసలో చేరారు. కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి లాంటోళ్లు బీజేపీలో చేరేందులు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారమ్. మరోవైపు, వీహెచ్ మాత్రం తెరాస ప్రభుత్వంపై ఎటాక్ చేస్తున్నారు. గవర్నర్ నరసింహాన్ ని తొలగించాలని కేంద్రానికి లేఖ రాశాడు. టీపీసీసీ పదవి కోసం వీహెచ్ చాన్నాళ్ల నుంచి ట్రై చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన దూకుడు చూపిస్తున్నట్టు పొలిటికల్ టాక్.