టీజర్ లో ‘ఆమె’ న్యూడ్ గా !


అమలాపాల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం ‘ఆడై’. ఈ చిత్రానికి రత్న కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో ‘ఆమె’ పేరుతో తీసుకొస్తున్నారు. బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ టీజర్‌ను విడుదల చేశారు. కుమార్తె కనిపించలేదని పోలీసులకు ఓ తల్లి ఫిర్యాదు చేయడం.. పోలీసులు ఆమెను వెతుక్కుంటూ వెళ్లడం.. ఇలా ఒక్కో సన్నివేశాన్ని టీజర్‌లో ఆసక్తికరంగా చూపించారు. టీజర్ లోనే అమలా న్యూడ్ గా కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.

ఆమె టీజర్ పై ప్రశంసలు వర్షం కురుస్తోంది. ‘ఆమె’ సినిమా టీజర్‌ అద్భుతంగా ఉందని కథానాయిక సమంత ట్వీట్‌ చేశారు. అమలాపాల్‌కు శుభాకాంక్షలు చెప్పారు. సినిమా గురించి తెలుసుకోవాలనే ఆతృత పెరిగిందని అన్నారు. చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఆమె టీజర్ ని చూస్తే.. లైంగిక వేధింపుల లైన్ తో తెరకెక్కిన సినిమాగా అర్థమవుతోంది. ఇంతకీ అమలాని లైంగికంగా వేధించింది ఎవరు ? ఆమె కథేంటీ అన్నది సినిమాలో చూడాలి.