అనిరుధ్ మళ్లీ.. అదే నిర్లక్ష్యం !

యువ సంగీత సంచలనం అనిరుధ్ దగ్గర వున్న పెద్ద సమస్య టైమ్ కు ట్యూన్ లు అందివ్వకపోవడమేనని టాలీవుడ్ టాక్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ఆయన చేసిన రెండో సినిమా ‘జెర్సీ’. అద్భుమైన నేపథ్య సంగీతం ఇచ్చాడు. నాని తాజా చిత్రం ‘గ్యాంగ్ లీడర్’కు అనిరుధ్ నే సంగీతం అందిస్తున్నారు. ఐతే, ఈ సినిమాకు ఇప్పటి వరకు ఒక్క ట్యూన్ మాత్రమే ఇచ్చాడట. ఈ సినిమాలో మూడు పాటలు మాత్రమే వుంటాయని తెలుస్తోంది. మరో ప్రమోషన్ సాంగ్ ఉండొచ్చు.

ఈ నాలుగు ట్యూన్ లకే ఒక్కటి మాత్రం ఇచ్చి, మిగిలినవి బకాయి పెట్టాడని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు విక్రమ్ కుమార్ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గ్యాంగ్ లీడర్ రిలీజ్ డేటుని ఆగస్టు30గా ప్రకటించారు. ఆలోపు సినిమా పూర్తి చేయాలి. లేదంటే లెక్కలు మారతాయ్. ఈ నేపథ్యంలో అనిరుధ్ తో మిగితా ట్యూన్స్ చేయించుకొనేందుకు విక్రమ్ కుమార్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ టైటిల్ కావడంతో నాని గ్యాంగ్ లీడర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.