సునీల్ తో ప్రియదర్శికి పోలికా !
పెద్ద విలన్ అవుదామనికొని పెద్ద కమెడియన్ అయినవారిలో సునీల్ ఒకరు. ఆ తర్వాత పెద్ద హీరో అవుదామని కూడా ప్రయత్నాలు చేశాడు. అవి బెడసికొట్టడంతో తిరిగి కమెడియన్ గా మారాడు సునీల్. ‘మల్లేశం’ టైటిల్ రోల్ లో నటిస్తున్న కమెడియన్ ప్రియదర్శి కూడా పెద్ద విలన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాడట. రెండు సినిమాల్లో విలన్ గా నటించాడు కూడా. టెర్రర్, బొమ్మలరామారం సినిమాల్లో విలన్ గా కనిపించాడు. ఐతే, ‘పెళ్లి చూపులు’ సినిమా ప్రియదర్శిని కమెడియన్ ని చేసింది.
‘మల్లేశం’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రియదర్శి కమెడియన్ ఎందుకు మారాల్సి వచ్చింది అనే విషయాలు చెప్పాడు. “నేను కమెడియన్ అవుదామని రాలేదు. విలన్ అవుదామని వచ్చాను. నా మొదటి 2 సినిమాల్లో నేను విలన్. అప్పట్లో కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ లా ఊహించుకునేవాడ్ని. టెర్రర్, బొమ్మలరామారం లాంటి సినిమాల్లో విలన్ గా చేశాను. కేవలం అవకాశాల్లేక పెళ్లిచూపులు సినిమా చేశానని, అది తన జీవితాన్ని మార్చేస్తుంది. కమెడియన్ ని చేసింది” అన్నారు.