డియర్ కామ్రేడ్ : ‘గిర గిర గిర.. ‘ సాంగ్ విన్నారా ?
కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-రష్మిక మందన జంటగా నటించిన చిత్రం “డియర్ కామ్రేడ్”. జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, ఈ సినిమా నుంచి ‘గిర గిర గిర.. ‘ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసింది చిత్రబృందం. రెహమాన్ లిరిక్స్ అందించిన ఈ పాటను గౌతమ్ భరద్వాజ్, యామిని గంటసాల పాడారు. జితిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
పెళ్లి వేడుక నేపథ్యంలో ఈ పాటని చిత్రీకరించారు. వినడానికి ఆహ్లాదకరంగా ఉంది. చిత్రీకరణ కూడా వైవిధ్యంగా ఉంది. ఇందులో ఎలాంటి రొమాటింక్ సీన్స్ లేవు. పెళ్లి పనులు జరుగుతుండగానే మొత్తం సాంగ్ సాగింది. విజయ్ దేవరకొండ పెళ్లి పనుల్లో బిజీగా ఉండటం ఇందులో చూడొచ్చు. వినడానికి పాట చాలా బాగుంది. బిగ్ తెరపై మరింత అందంగా కనిపించేలా ఉంది.