‘ఓ బేబీ’ ట్రైలర్ టాక్


స్టార్ హీరోయిన్ సమంతలో అప్పుడే ముసలి లక్షణాలు కనిపిస్తున్నాయ్. ఆమె 74యేళ్ల ముసలిదానిలా ప్రవర్థిస్తోంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. నంది రెడ్డి దర్శకురాలు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

‘బేబీ 70 ఏళ్ల ముసల్ది కాదు. 24 ఏళ్ల పడుచు పిల్ల’ అని రాజేంద్ర ప్రసాద్‌.. రావు రమేశ్‌తో చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. వినోదాత్మకంగా సాగుతూనే ఎమోషన్స్ ని టచ్ చేసింది ట్రైలర్. ‘దేవుడు మళ్లీ వయసిచ్చాడు. ఆ వయసు మళ్లీ రెక్కలు విప్పుకొంటుంది’ అంటూ సమంత ఏడుస్తూ చెప్పే డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాతో సమంత మరోసారి మాయ చేయబోతున్నట్టు కనబడుతోంది. ‘బేబీ’ నవ్విస్తుంది. ఏడిపిస్తుంది. మొత్తంగా బేబీతో ఎంజాయ్ మెంట్ మాములుగా ఉండదని ట్రైలర్ తో అర్థమైంది. జులై5 నుంచి ఆ ఎంజాయ్ మెంట్ ని థియేటర్స్ లో చూడొచ్చు.

మిస్‌ గ్రానీ’ అనే కొరియన్‌ సినిమాకు ‘ఓ బేబీ’ రీమేక్‌గా రాబోతోంది. ఇందులో ఓ వృద్ధురాలికి మళ్లీ యవ్వన వయసు వస్తే ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారు. సమంత వృద్ధురాలయ్యాక ప్రముఖ నటి లక్ష్మి పాత్రలో కనిపిస్తారు. మాస్టర్‌ తేజ మనవడిగా కన్పించనున్నారు. నాగశౌర్య కీలక పాత్రను పోషించారు. అడవి శేష్ కూడా ఉన్నాడు.