విజయ్ దేవరకొండ డైరెక్టర్ పనిలో వేలు పెడుతున్నాడా ?

టాలీవుడ్ సన్సేషన్ విజయ్ దేవరకొండకు కొత్త దర్శకులపైనే గురి ఎక్కువ. ఆయన్ని స్టార్ చేసింది వారే. ‘పెళ్లి చూపులు’ సినిమా తరుణ్ భాస్కర్ తొలి సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హీరోగా విజయ్ దేవరకొండని నిలబెట్టింది. సందీప్ వంగా కు ‘అర్జున్ రెడ్డి’ తొలిచిత్రమే. సంచలన విజయాన్ని నమోదు చేసింది. విజయ్ దేవరకొండని స్టార్ ని చేసింది. రిలీజ్ కి రెడీ అవుతున్న విజయ్ తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’కు కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. ఐతే, భరత్ ని విజయ్ నమ్మడం లేదట.

ఈ సినిమా దర్శకుడి పనిలో విజయ్ వేలు పెడుతున్నట్టు సమాచారమ్. సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కొన్ని సన్నివేశాలని రీషూట్ చేశారు కూడా. ఎడిటింగ్ టేబుల్ పై ఏ సీన్ ఉంచాలి. ఏ సీన్ ని తీసేయాలన్నది స్వయంగా విజయ్ దేవరకొండనే చేస్తున్నాడట. ఈ విషయంలో దర్శకుడు భరత్ కమ్మ హర్ట్ అయినట్టు తెలుస్తోంది. విజయ్ పై నమ్మకంతో నిర్మాతలు కూడా ఏమీ అనడం లేదట. గతంలో విజయ్ నటన, సినిమా ప్రమోషన్స్ పై తప్ప మరో విషయంలోనూ వేలుపెట్టేవాడు కాదు. ఇప్పుడేమో.. ఆయనకు కొత్త అలవాట్లు వచ్చినట్టున్నాయి. అవి మంచి ఫలితాన్నిస్తే పర్వాలేదు. లేదంటే ఇమేజ్ డ్యామేజ్ కావడం ఖాయం.