బిగ్ బాస్3 హోస్ట్’గా నాగ్.. ఇంకా సస్పెన్స్ నే !


బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 త్వరలోనే ప్రారంభం కాబోతుంది. హోస్ట్ గా నాగార్జున ఫిక్సయ్యాడు. కానీ, ఆ విషయాన్ని ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా బిగ్ బాస్ 3 హోస్ట్ కు సంబంధించి ఓ సస్పెన్స్ ప్రోమోని వదిలింది బిగ్ బాస్ యాజమాన్యం.

ఇందులో ఓ గురువు పిల్లలకి కథ చెబుతుండటం చూడొచ్చు. “మనసు కోతిలాంటిది. మరీ.. అలాంటి మనసున్న మనుషులు ఓ ఇంట్లో చేరితే.. మమకారంతో, వెటకారంతో వారిని ఏకతాటిపైకి తెచ్చేది ఎవరు ? అధికారంతో నడిపేది ఎవరు ? ఆ ఇంట్లో కొత్త ఉత్సాహం నింపే శక్తిగల వ్యక్తి ఎవరు ?” అంటూ ప్రోమోని ఆసక్తిగా తీసుకొచ్చారు. నాగ్ నడక, స్టయిలీష్ బ్యాక్ లుక్ ని మాత్రమే రివీల్ చేశారు. బిగ్ బాస్ 3 హోస్ట్ గా నాగార్జున అన్న విషయాన్ని ఇంకా సస్పెన్స్ లోనే ఉంచారు. బహుశా.. త్వరలోనే ఆ సస్పెన్స్ కి తెరదించనున్నారు.