అమలా న్యూడ్ సీన్స్ కి కత్తెర

అమలాపాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆడై’. తెలుగులో ‘ఆమె’ తీసుకొస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఆమె టీజర్ లో అమలా న్యూడ్ గా కనిపించి షాక్ ఇచ్చింది. ఒంటిపై ఒక్క నూలుపోగు కూడా లేకుండా కనిపించింది. టీజర్ లోనే ఈ రేంజ్ లో చూపిస్తే.. సినిమాలో ఇంకెరేంజ్ లో ఉంటుందనే కామెంట్స్ వినిపించాయి. ఐతే, అమలా న్యూడ్ పిక్స్ కి సెన్సార్ కత్తెర పెట్టనుందని సమాచారమ్. వాస్తవానికి అమలా న్యూడ్ గా నటించలేదు. కొన్ని ట్రిక్స్ ప్లే చేసి.. అలా చూపించారంతే.

సినిమాలో ఆ ట్రిక్స్ కి కూడా సెన్సార్ నో చెప్పిందనుంది. టీజర్ లో అమలా న్యూడ్ షో మాత్రం సినిమాకి మంచి పబ్లిసిటీని తీసుకొచ్చింది. ఇప్పటికే ఆమె జనాల్లోకి వెళ్లింది. ఇక థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులని ఆమె కథ సంతృప్తి పరిస్తే చాలు. ఈ చిత్రానికి రత్న కుమార్ దర్శకుడు. ఇదో లైంగికల్ వేధింపులు, రేప్ కేసు నేపథ్యంలో సాగే కథగా టీజర్ చూస్తే అర్థమయింది.