అది శేఖర్ కమ్ములకి సాధ్యమా ?

టాలీవుడ్ ఫటాఫట్ సినిమాలు తీసే దర్శకుడుగా పూరి జగన్నాథ్ కు ఉంది. ఆయన రెండు, మూడు నెలల్లోనే సినిమాని పూర్తి చేయగలడు. అంత వేగం ఉన్న దర్శకుడు టాలీవుడ్ లో మరొకరు లేరని చెబుతుంటారు. ఐతే, వరుస ప్లాపుల నేపథ్యంలో పూరి కూడా స్వీడు తగ్గించేశాడు. ఆయన తాజా చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ని నెమ్మదిగానే కానిస్తున్నాడు. ఇక, నాని, అల్లరి నరేష్ సినిమాలు చాలా స్వీడుతో షూటింగ్ జరుపుకొంటుంటాయ్. అందుకే వీరు యేడాదికి మూడ్నాలుగు సినిమాలు చేయగలుగుతున్నారు.

చాలా నెమ్మదిగా, యేడాదికి పైగా సినిమాని పూర్తి చేస్తే క్లాస్ దర్శకుడు శేకర్ కమ్ముల ఈసారి స్వీడుపెంచాడు. ‘ఫిదా’ తర్వాత ఆయన చేస్తున్న సినిమాకి నాగ చైతన్యని హీరోగా ఎంచుకొన్నాడు. మరోసారి సాయిపల్లవిని రిపీట్ చేయనున్నాడు. ఐతే, ఈ సినిమాని కేవలం 70రోజుల్లో పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకొన్నాడు కమ్ముల. ఇది ఆయనకి సాధ్యమేనా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఐతే, కమ్ముల స్వీడు పెంచితే మంచిదే. యేడాదికో రెండు క్లాస్ సినిమాలు చూడొచ్చని కమ్ముల అభిమానులు ఆనందపడుతున్నారు.

ప్రస్తుతం నాగచైతన్య ‘వెంకీ మామ’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల సినిమాని మొదలెట్టనున్నాడు. కమ్ముల దర్శకత్వంలో నటించాలని చైతూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ అది కుదిరింది. కమ్ముల సినిమా కోసం తన సినిమాలన్నీ పక్కకుపెట్టేసి.. మరీ చేస్తున్నాడు చైతూ. ఈ చిత్రాన్ని ఏషియన్ మూవీస్ నిర్మించనుంది.