స్టార్ హీరోయిన్లకి గది పిలుపులు


టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా గదిలోకి వెళ్తున్నారు. ‘రాజుగారి గది’తో దర్శకుడిగా మారాడు ఓంకారు. చాలా చిన్ని బడ్జెట్ వచ్చిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకొంది. ఈ నేపథ్యంలో ‘రాజుగారి గది2’ని కాస్త గ్రాండ్ ప్లాన్ చేశాడు. కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించారు. స్టార్ హీరోయిన్ సమంతని మంచి పాత్రలో చూపించాడు. ఇప్పుడు ‘రాజుగారి గది3’ని కూడా రెడీ చేస్తున్నాడు.

ఈసారి రాజుగారి గదిలోకి మిల్కీ బ్యూటీ తమన్నాని తీసుకొన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం గురువారం ప్రారంభమైంది. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈరోజు నుంచే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వినోదాన్ని పంచుతూనే భయపెట్టడం రాజుగారి గది ప్రత్యేకత. ఇలాంటి పాత్రలకి తమన్నా సరిగ్గా సూటవ్వతుందని అభినేత్రితో రుజువైంది. అందుకే రాజుగారి మూడో గదికి తమన్నాని పిలిచినట్టున్నారు.