హైదరాబాద్ ట్రాఫిక్’పై సీఎం కేసీఆర్ సీరియస్

హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాల గురించి తెలిసిందే. కొద్దిపాటి వర్షం పడింది అంటే.. ఆ గోస చెప్పలేనిది. శుక్రవారం కురిసిన వర్షానికి ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచింది. దానికి సంబంధించిన వీడియోలని టీవీ ఛానెల్స్, సోషల్ మీడియాలోనూ ప్రసారమయ్యాయి. వీటిని చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులపై సీరియస్ అయ్యారు. ఇటువంటి ఘటనలు పునరావృతమవకూడదని స్పష్టం చేశారు.

పోలీస్‌, జీహెచ్‌ఎంసీ అధికారుల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. సీఎం ఆదేశాలతో సైబరాబాద్‌ కమిషనర్‌, జీహెచ్‌ఎసీ కమిషనర్‌లు ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాల వల్ల తరచూ ముంపునకు గురువతున్నా ప్రాంతాలు, ట్రాఫిక్‌జామ్‌ అవుతున్న ప్రాంతాలను పరిశీలించారు. శుక్రవారం కురిసిన వర్షానికి ఐటీ కారిడార్‌ మొత్తం జామ్‌ అవడంతో సైబర్‌ టవర్స్‌, కొండాపూర్‌, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపుపై చర్చించారు.

మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు చేపట్టనున్నారు. గత జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ నగరమంతా విస్తృతంగా పర్యటించారు. నగర ప్రజల కష్టాలని తీరుస్తానని మాటించారు. వాటిలో మేజర్ సమస్య ట్రాఫిక్ కష్టాలని మాత్రం ఇంతవరకు తీర్చలేదు. మరీ.. ఇకనైనా.. ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టిస్తారిస్తే బాగుటుందని హైదరాబాద్ ప్రజలు కోరుతున్నరు.