హమ్మయ్యా…. అఫ్గానీస్థాన్ పై భారత్ గెలుపు !
పసికూన అఫ్గానీస్థాన్ భారత్ పై సంచలన విజయం సాధించేలా కనబడింది. ఐతే, భారత బౌలర్లు పట్టుదల ముందు అఫ్గాన్ తలవంచక తప్పలేదు. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 225పరుగులు మాత్రమే చేసింది. విరాట్ కోహ్లీ 67, శంకర్ 29, జాదవ్ 52, ధోనీ 28 పరుగులు చేశారు. అఫాన్ బౌలర్లలో నయిబ్ రెండు, నబీ రెండు, రషీద్, రహ్మత్, రెహ్మాన్, ఆలమ్ తలొక వికెట్ తీశారు.
226పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ గట్టిగా పోరాడింది. చివరి వరకు పోరాడింది. ఐతే, ఆఖరుల్లో బుమ్రా, షమీ అద్భుత బౌలింగ్ తో అఫ్గాన్ ని పరాజయం తప్పలేదు. అఫ్గాన్ 213 పరుగులకి ఆలవుట్ అయింది. షమీ ఆఖరి ఓవర్ లో హ్యాట్రిక్ వికెట్స్ పడగొట్టడం విశేషం. నబీ52, రెహమత్ 36, గుల్ బందిన్ నబీ 27 పరుగులతో రాణించారు. ఆఖరి ఓవర్ లో అఫ్గాన్ 18పరుగులు అవసరంగా కాగా.. మొదటి బంతికి నబీ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత షమీ వేసిన అద్భుత యార్కర్ కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన ఇద్దరు బ్యాట్స్ మెన్స్ వరుస బంతుల్లో అవుటయ్యారు. భారత బౌలర్లలో షమీ4, బూమ్రా, చహాల్ చెరో 2వికెట్లు పడగొట్టారు.