దారుణం : బాలికపై 10రోజులుగా 6గురు అత్యాచారం
ఒంగోలులో దారుణం చోటుచేసుకొంది. పదో తరగతి చదువుతున్న పదరేళ్ల బాలికను ఆరుగురు యువకులు.. పదిరోజుల పాటు సామూహిక అత్యాచారం చేసిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఆరుగురు నిందితుల్లో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు, ఒక దివ్యాంగ యువకుడు ఉన్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెఌతే.. పదహారేళ్ల బాలిక హాస్టల్‌లో ఉంటూ పదో తరగతి చదువుతోంది. అక్కడో కారు డ్రైవర్ పరిచయమయ్యాడు. అది ప్రేమకు దారితీసింది. అతడి ఆహ్వానంపై ఆమె ఒంగోలుకు వచ్చింది. రాత్రి బస్టాండులో దిగి తన స్నేహితుడి కోసం వేచిచూస్తోంది. అతడు ఎంతకూ రాకపోవడంతో పలుమార్లు ఫోన్ చేసింది. ఆమె పరిస్థితి గమనించి బస్టాండులో పనిచేసే దివ్యాంగుడైన ఒక యువకుడు.. ఆమె స్నేహితుడు తనకు తెలుసంటూ.. బాలికను బస్టాండు సమీపంలోని ఒక గదికి తీసుకెళ్లాడు.
అక్కడికి తన మిత్రుడిని పిలిపించాడు. ఇద్దరూ కలిసి ఆ రాత్రి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. ఆమెను సమీపంలోని మరో గదికి తరలించారు. అక్కడ నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నారు. వారు అప్పటినుంచి ఆమెపై పదే పదే అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెని చిత్రహింసలు పెట్టేవాడు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకొన్న బాలిక పోలీసులకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దివ్యాంగ యువకుడితో పాటు ముగ్గురు ఇంజనీర్ విద్యార్థులని అరెస్ట్ చేశారు.