నల్లా బిల్లు ఎగవేసిన సీఎం


మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ రూ. 7లక్షల నల్లా బిల్లు ఎగవేయడం హాట్ టాపిక్ గా మారింది. ముంబయిలోని మలబార్‌హిల్స్‌ ప్రాంతంలో ఉన్న ఫడణవీస్‌ అధికారిక నివాసం ‘వర్షా’ బంగ్లా 2001 నుంచి నీటి బిల్లు చెల్లించట్లేదని సహ చట్టం ద్వారా చేసిన దరఖాస్తుకు బీఎంసీ సమాధానమిచ్చింది.

ముఖ్యమంత్రే కాదు.. మహారాష్ట్ర మంత్రులు సుధీర్‌ ముంగతివార్‌, పంకజా ముండే, రామ్‌దాస్‌ కదమ్‌ సహా 18 మంది మంత్రుల పేర్లను కూడా ఎగవేతదారుల జాబితాలో చేర్చినట్లు తెలిపింది. వీవీఐపీల పెండింగ్‌ నల్లా బిల్లు ఏకంగా రూ. 8కోట్ల పైనే ఉందట. మరికొద్ది నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో సీఎం నల్లా బిల్లు ఎగవేత ప్రతిపక్షాలకు ఆయుధంగా మారనుంది.