మెగా ఫ్యామిలీ పిక్.. రెండు విచిత్రాలు.. !

మెగా కుటుంబం ఆదివారం ఒక్కచోటికి చేరింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రామ్‌ చరణ్‌, వరుణ్‌ తేజ్‌, నిహారిక, సాయిధరమ్‌ తేజ్‌, కల్యాణ్‌దేవ్‌, శ్రీజ, సుస్మిత తదితరులు కలిసిన ఫోటోలు అవి. ఈ ఫోటోలని కొణిదెల కోడలు ఉపాసన సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. శ్రీజ, సాయిధరమ్‌, కల్యాణ్‌దేవ్‌ కూడా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఇదే ఫొటోలను పంచుకున్నారు. ‘అందమైన ఆదివారం’ అంటూ వర్షం, ఇల్లు, కుటుంబం, ప్రేమ అనే హ్యాష్‌ట్యాగ్‌లను సాయిధరమ్‌ జత చేశారు.

మెగా ఫ్యామిలీ పిక్ లో రెండు విచిత్రాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఒకటి వరుణ్ తేజ్ లుక్. గడ్డం లుక్ లో మరీ నాటుగా ఉన్నాడు. ‘వాల్మీకి’ సినిమా కోసం వరుణ్ గడ్డం పెంచిన సంగతి తెలిసిందే. మరో విచిత్రం ఏటంటే ? మెగా హీరోయిన్ నిహారిక బావ సాయిధరమ్ తేజ్ ఒళ్లు వాలిపోయినట్టు పోజులిచ్చింది. గతంలో వీరిద్దరి ప్రేమలో ఉన్నట్టు, పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలొచ్చొన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పిక్ ఆకట్టుకుంటోంది. ఇక, రామ్ చరణ్, కల్యాణ్ దేవ్ పాత లుక్కుల్లోనే కనిపించారు.