పిల్లలను గారాబం చేయకుండా నియంత్రించడం ఎలా ?

ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో నేచురల్ స్టార్ నాని ముచ్చటించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం రాత్రి ‘యోగా- ఇన్‌ కన్వర్జేషన్‌ విత్‌ ది మిస్టిక్‌ విత్‌ సద్గురు’ కార్యక్రమంలో నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సద్గురుని నాని కొన్ని ప్రశ్నిలు అడిగారు. పిల్లలను గారాబం చేయకుండా నియంత్రించడం ఎలా ? అని నాని ప్రశ్నించగా.. తాము ఎలా వ్యవహరించాలో పిల్లలకు బాగా తెలుసు. చిన్నారులు తల్లిదండ్రులను గమనిస్తూ వారి నుంచి అనేక విషయాలు నేర్చుకుంటారని సద్గురు చెప్పారు.

మనం ఆనందంగా ఉంటే అన్నీ అద్భుతంగా, చక్కగా ఉంటాయి. మానసిక సమస్యలకు బయటి నుంచి సహకారం పొందడం కన్నా మనిషి తన అంతర్గత శక్తి ద్వారానే పరిష్కారాలను కనుగొనవచ్చని సద్గురు జగ్గీ వాసుదేవ్‌ అన్నారు. సినిమాలు సమాజంపై ప్రభావం చూపిస్తాయని, సమాజాన్ని చైతన్యపరిచేలా చిత్రాలు ఉండాలని పేర్కొన్నారు. సినిమాల్లో హింస, అసభ్యకర దృశ్యాల విషయంలో నియంత్రణ ఉండాలని సద్గురు అభిప్రాయపడ్డారు.