నాకౌట్‌ రేసు నుంచి దక్షిణాఫ్రికా ఔట్

సెమీఫైనల్‌ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ సత్తా చాటింది. దక్షిణాఫ్రికాను అలవోకగా మట్టికరిపించింది.
49 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన పాక్ 7 వికెట్లకు 308 పరుగులు చేసింది. బాబర్‌ అజామ్‌ (69; 80 బంతుల్లో 7×4), ఇమాముల్‌ హక్‌ (44), ఫకర్‌ జమాన్‌ (44) రాణించారు.

ఛేదనలో దక్షిణాఫ్రికా చతికిల పడింది. షాదాబ్‌ ఖాన్‌ (3/50), ఆమిర్‌ (2/49), వాహబ్‌ రియాజ్‌ (3/46) విజృంభించడంతో 9 వికెట్లకు 259 పరుగులే చేయగలిగింది. డుప్లెసిస్‌ (63; 79 బంతుల్లో 5×4) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. హారిస్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాకు ఇది ఐదో పరాజయం. ఆ జట్టు ఒక్క మ్యాచే నెగ్గింది. ఒకటి రద్దయింది. ఐదో ఓటమి చవిచూసిన దక్షిణాఫ్రికా ఇక సాంకేతికంగా కూడా నాకౌట్‌ రేసులో లేదు.