లేడీ డైరెక్టర్ ప్రభాస్ కు పడిపోయింది.. !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని దూరం నుంచి ఆరాధిస్తోంది లేడీ డైరెక్టర్ నందినీరెడ్డి. తనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. పిచ్చి. కానీ, ఎప్పుడు ఆయనకి చెప్పలేదు. ‘ప్రభాస్‌పై తనకు ఎప్పుడూ క్రష్ ఉండేదని.. కానీ ఈ మాటను ప్రభాస్‌కు చెప్పలేకపోయా. ప్రభాస్ ఎదురుగా ఉంటే నోట మాట కూడా రాదు. ప్రభాస్‌తో కలిసి పనిచేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తా’నన్నారు నందినీరెడ్డి.
ఆమె తాజా చిత్రం ‘ఓ బేబీ’. సమంత ప్రధాన పాత్రలో నటించారు. నాగశౌర్య, రావు రమేశ్, మాస్టర్ తేజ, రాజేంద్రప్రసాద్, లక్ష్మి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘మిస్ గ్రానీ’ అనే కొరియన్ సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. జులై 5న ‘ఓ బేబీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నందినీరెడ్డి ప్రభాస్ పై తనకున్న ప్రేమని బయటపెట్టింది.