చంద్రబాబుకు కరెంట్ షాక్


ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడు చూపిస్తున్నారు. చెప్పినట్టుగానే అన్ని శాఖల్లోనూ అవినీతిని వెలికితీసే పనిలో పడ్దారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంపై సీఎం జగన్‌ దృష్టి సారించారు. విద్యుత్‌, ఇంధనశాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. బిడ్డింగ్‌ ధరల కన్నా అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు కారణంగా రూ.2,636 కోట్ల నష్టం వాటిల్లిందని.. ఆ డబ్బును రికవరీ చేయాలని జగన్‌ ఆదేశించారు.

గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ ఒప్పందాలు చేసిన ఉన్నతాధికారి, అప్పటి మంత్రి, సీఎంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని.. ఈ అంశంపై కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ ప్రక్రియని జెడ్ స్వీడుతో పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తానికి.. మాజీ సీఎం చంద్రబాబు టార్గెట్ గా తాజా సీఎం జగన్ ఎటాక్ చేస్తున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతలో భాగంగా ప్రజావేదికని కూల్చేస్తున్న సంగతి తెలిసిందే. దాని పక్కనే ఉన్న చంద్రబాబు నివాసాన్ని కూల్చేయనున్నారని తెలుస్తోంది. అది కూడా అక్రమ కట్టడమేనని సీఎం జగన్ ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే.