టైగర్’తో బ్రేకప్ అయిందా ?


నిండైన అందాలు దిశా పటానీ సొంతం. ఆ అందానికి టైగర్ పడిపోయాడు. టైగర్‌ ష్రాఫ్‌, దిశా పటానీ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసింది. ఈ విషయాన్ని వారు పరోక్షంగా తెలిపారు. ప్రేమికుల రోజున ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే రకమైన పోజ్‌తో ఉన్న ఫొటోలు పోస్ట్‌ చేశారు. టైగర్‌ తన ఫొటోకు ‘ప్రేమలో ఉన్నా’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ‘ఇద్దరికీ సిగ్గే. అందుకే ఏ విషయం అన్నది చెప్పలేకపోతున్నాం’ అని దిశా ఓసారి మీడియాతో అన్నారు. అంతేకాదు.. పార్టీ, పబ్బుల చుట్టూ గట్టిగానే తిరిగారు.

ఇదంతా చూస్తుంటే.. టైగర్ తో దిశా ప్రేమ పెళ్లి పీఠల వరకు వెళ్లేలా అనిపించింది. కానీ, ఆ ప్రేమకు సడెన్ బ్రేకులు పడతాయని ఎవరు ఊహించలేదు. ఇప్పుడదే జరిగినట్టు సమాచారమ్. వీరిద్దరూ విడిపోయారని వార్తలు వెలువడుతున్నాయి. పరస్పరం చర్చించుకునే విడిపోయారని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ జంట ఇప్పటివరకు ప్రేమలో ఉన్న విషయమే బయటపెట్టలేదు. ఇక విడిపోయిన విషయం ఎందుకు అధికారికంగా వెల్లడిస్తారు ? సలైంట్ గా విడిపోయారంటేనని బాలీవుడ్ లో గుసుగుసలు వినిపిస్తున్నాయ్.