వైరల్ : ఫొటోగ్రాఫర్లపై దీపికా సటైర్

హీరో కానీ హీరోయిన్‌ కానీ కనిపించారంటే ఫొటోగ్రాఫర్లకు పండగే. చకచకా ఫొటోలు క్లిక్‌మనిపించేస్తుంటారు. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కనిపిస్తే వదులుతారా ? వెంబడిస్తూ ఫొటోలు తీసేస్తుంటారు. దీపికా ముంబయి ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఇంటికి వెళ్లే సమయంలోనూ ఫొటోగ్రఫర్లు అదే పని చేశారు. ఆమె కారు ఎక్కుతుండగా ఫొటోలు తీసేందుకు ఆతృత చూపించారు.

ఆ సమయంలో దీపికా ఫొటోగ్రఫర్లపై వేసిన సటైర్ వైరల్ అవుతోంది. ‘రండి నా కారులోకి వచ్చి కూర్చోండి’ ఫొటోగ్రఫర్ల ని ఉద్దేశించి దీపిక కామెంట్ చేసిండి. ఆ సమయంలో ముంబయికి చెందిన ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ విరాల్‌ భయానీ దీపిక రియాక్షన్‌ను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.