కివీస్ పై పాక్ గెలుపు


పాక్ మరోసారి మెరిసింది. ప్రపంచకప్ లో బలమైన జట్టుగా పేరొందిన న్యూజిలాండ్ ని ఓడించింది. టాస్‌ గెలిచి మొదటి బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో కివీస్‌ 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. నీషమ్‌(97*; 112బంతుల్లో 5×4, 3×6), గ్రాండ్‌హోమ్‌ (64; 71బంతుల్లో 6×4, 1×6), విలియమ్సన్‌(41; 69బంతుల్లో 4×4) రాణించారు. పాక్‌ బౌలర్లలో షాహిద్‌ అఫ్రిది (3/28), షాదాబ్‌ ఖాన్‌(1/43) వికెట్లు తీశారు.

238పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ అద్భుత పోరాటాన్ని కనబర్చింది. 49.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాని చేధించింది. బౌల్ట్‌ వేసిన మూడో ఓవర్‌ చివరి బంతికి ఫకర్‌ జమాన్‌ (9) గప్తిల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 11ఓవర్ లో ఇమాముల్‌(19; 29బంతుల్లో 3×4) షాట్‌ ఆడే ప్రయత్నంలో గప్తిల్‌ చేతికి చిక్కాడు. కెప్టెన్ విలియమ్సన్‌ బంతితోనూ సత్తా చాటాడు. హఫీజ్‌(32; 50బంతుల్లో 5×4)ను అవుట్ చేశాడు. ఆ సమయంలో పాక్ 110/3గా ఉంది. ఆ తర్వాత బాబార్ 101 (127 బంతుల్లో), సోహెల్ 68 (76 బంతుల్లో) అద్భుత పోరాటంతో పాక్ కి విజయాన్ని అందించారు. ఈ విజయంతో పాక్ సెమీస్ అవకాశాలని మరింతగా మెరుగుపరుచుకొంది.