‘బ్రోచేవారెవరురా’ ట్విట్టర్ రివ్యూ

మంచి నటుడు అనిపించుకున్నాడు శ్రీ విష్ణు. వైవిధ్యమైన కథలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొన్నాడు. హీరోగా నిలదొక్కుకొనే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన తాజా చిత్రం ‘బోచేవారెవరురా’. ‘మెంటల్ మదిలో ఫేం’ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వహించారు. నివేదా థామస్ కథానాయిక. ప్రియదర్శిని, రాహుల్ రామకృష్ణలు కీలక పాత్రలో నటించారు. ఓ మోస్తరు అంచనాల మధ్య బ్రోచేవారెవరురా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే బెనిఫిట్ షోస్ పడిపోయాయి. ట్విట్టర్ వేదికగా నెటిజన్స్ సినిమా టాక్ ని షేర్ చేస్తున్నారు. దానిపై ఓ లుక్కేద్దాం పదండీ.. !

థియేటర్స్ లో నవ్వులే నవ్వులు. నాన్ స్టాప్ గా నవ్వించేశారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ కథ-కథనం గ్రిప్పింగా నడిపారని ట్విట్ చేస్తున్నారు. కథ, కథనం, సంగీతం, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం అద్భుతంగా కుదిరాయి. ఫస్టాఫ్ లో పెద్దగా కథలేకపోయినా.. వినోదాత్మకంగా సాగింది. కడుపుబ్బ నవ్వించేశారు. సెకాంఢాఫ్ లోనూ తగ్గలేదు. శ్రీవిష్ణు, నివేదా థామస్ అద్భుతంగా నటించారని చెబుతున్నారు. సినిమాకు వినోదం, నటీనటుల ప్రతిభ ప్రధాన బలంగా చెబుతున్నారు. నేచురల్ స్టార్ నాని ఇప్పటికే సినిమా చూసేశారు. సినిమా సూపర్ అంటూ కితాబిచ్చారు. రేటింగ్స్ కూడా 4/5 ఇస్తున్నారు. దీంతో.. శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ ఖాయమైంది.

Upcoming directors, cameramans and music directors unte assalu miss avvakandi. Pure magic on screen #Brochevarevarura