‘కల్కీ’ పబ్లిక్ టాక్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన చిత్రం ‘కల్కీ’. అదా శర్మ కథానాయిక. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. టెక్నికల్ గా సినిమా రిచ్ గా అనిపించింది. ప్రశాంత్ వర్మ టేకింగ్, రాజశేఖర్ యాక్షన్ హైలైట్ గా నిలిచాయి. దీంతో కల్కీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ అంచనాల మధ్య కల్కీ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
గురువారం రాత్రి పడాల్సిన కల్కీ ప్రీమియర్ షోస్ రద్దయ్యాయి. ఈ రోజు ఉదయం బెనిఫిట్ షోస్ మాత్రం పడిపోయాయి. ప్రశాంత్ వర్మ టేకింగ్ బాగుందని చెబుతున్నారు. ఫస్టాఫ్ సినిమా యావరేజ్ గా అనిపించింది. ఐతే, సెకాంఢాఫ్ సస్పెన్స్, ట్విస్టులతో రక్తికట్టించాడు. ఒకట్రెండు దిమ్మతిరిగే ట్విస్టులున్నాయి. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం అద్భుతంగా కుదిరాయి. ఫస్టాఫ్ యావరేజ్, సెకాంఢాఫ్ సూపర్భ్ అనే టాక్ వినిపిస్తోంది.
#Kalki first half report – Below Average.
Rushed Screenplay
Weak Story
Bad BGM#KalkiOnJune28th #Rajasekhar #AdahSharma #nanditaswetha
— PaniPuri (@THEPANIPURI) June 28, 2019