‘ఓ బేబీ’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఎప్పుడు.. ఎక్కడ ?

సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. నందినిరెడ్డి దర్శకురాలు. ఓ వృద్ధురాలికి మళ్లీ యవ్వన వయసు వస్తే ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. సమంత వృద్ధురాలయ్యాక ప్రముఖ నటి లక్ష్మి పాత్రలో కనిపిస్తారు. మాస్టర్‌ తేజ మనవడిగా కన్పించనున్నారు. నాగశౌర్య కీలక పాత్రను పోషించారు. జులై 5న ఓ బేబీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ని రేపు (శనివారం) నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని జెఆర్ సీ కన్వెన్షన్ సెంటర్ వేడుక జరగనుంది. ఈ మేరకు సమంత ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ వేడుకకి చీఫ్ గెస్ట్ గా ఎవరు హాజరవుతారు అన్నది తెలియాల్సి ఉంది. ఈ యేడాది ‘మజిలీ’తో హిట్ కొట్టింది సామ్. ఓ బేబీ టీజర్, ట్రైలర్ ని చూస్తే.. ఆమె మరోసారి మేజిక్ చేయబోతున్నట్టు అనిపిస్తోంది. టీజర్ తోనే నాతో ఎంజాయ్ మెంట్ మాములుగా ఉండదు. చూస్తారుగా అని చెప్పింది. ఆ ఎంజాయ్ మెంట్ ని చూడాలంటే ఈ నెల 5వ ఆగాల్సిందే.