లైవ్ : ‘ఓ బేబీ’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్

నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. ఓ వృద్ధురాలికి మళ్లీ యవ్వన వయసు వస్తే ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. సమంత వృద్ధురాలయ్యాక ప్రముఖ నటి లక్ష్మి పాత్రలో కనిపిస్తారు. మాస్టర్‌ తేజ మనవడిగా కన్పించనున్నారు. నాగశౌర్య కీలక పాత్రను పోషించారు. జులై 5న ఓ బేబీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లోని జెఆర్ సీ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతోంది. ఈ వేడుకకి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రానా దగ్గుపాటి కూడా హాజరయ్యారు. కలర్ ఫుల్లుగా ఓ బేబీ ప్రీ-రిలీజ్ వేడుక జరుగుతోంది. ఈ వేడుకని లైవ్ లో చూడటానికి క్రింది లింక్ ని క్లిక్ చేయండి.. !