‘క్యాంటీన్ సాంగ్’లో కలర్ మిస్సయిందిగా.. !


కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-రష్మిక మందన జంటగా నటించిన చిత్రం “డియర్ కామ్రేడ్”. జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘కాలేజీ క్యాంటీన్.. ‘ వీడియో సాంగ్ ని విడుదల చేసింది చిత్రబృందం.

ఈ పాటకు రెహమాన్ రిలిక్స్ అందించారు. #KARTHIK RODRIGUEZ పాడారు. జితిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. స్నేహితులతో కలసి కాలేజీ క్యాంటీన్ లో విజయ్ దేవరకొండ సరదాగా పాటేసుకోవడం.. మాస్ స్టెప్పులతో అదరగొట్టడం ఈ పాటలో చూడొచ్చు. యూత్ బాగా కనెక్ట్ అయ్యేలా ఈ సాంగ్ ఉంది. ఫుల్ జోష్ గా సాగిన క్యాంటీన్ సాంగ్ లో కలర్ మిస్సయింది. రస్మిక కనిపించలేదు.

కాలేజీ రాజకీయాలు, ప్రేమ నేపథ్యంలో సాగే చిత్రమిది. టీజర్ కి మంచి స్పందన వచ్చింది. టీజర్ లో విజయ్-రస్మికల లిప్ లాక్ సీన్ హైలైట్ గా నిలిచింది. ఈ ఒక్క సీన్ చాలు సినిమా ప్రమోషన్స్ కోసం అన్నట్టుగా ఉంది. పాటలు యూత్ కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. దక్షిణాదిలో అన్నీ బాషల్లో విడుదలకాబోతున్న డియర్ కామ్రేడ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జులై26 డియర్ కామ్రేడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.