బేబీ హాటు హాటుగా.. !


హీరోయిన్స్ రెండు రకాలు. కొందరు అభినయంతో రాణిస్తారు. మరికొందరు అందంతో నెగ్గుకొస్తారు. గ్లామర్ షో తో కమర్షియల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొంటారు. ఇక అందం+అభినయం ఆకట్టుకొనే హీరోయిన్స్ స్టార్ హీరోయిన్స్ ఇండస్ట్రీని ఏలుతుంటారు. సమంత ఈ కోవకు చెందిన హీరోయినే. ఆమె తొలి చిత్రం ‘ఏం మాయ చేసావె’తోనే మేజిక్ చేసింది. ఆ మేజిక్ ని మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తోంది. ఐతే, ఎప్పుడూ హద్దులు దాటి గ్లామర్ షో చేయలేదు. శనివారం జరిగిన ‘ఓ బేబీ’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో సామ్ హాట్ హాట్ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. క్లీవేజ్ షోతో అదరగొట్టేసింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓ వృద్ధురాలికి మళ్లీ యవ్వన వయసు వస్తే ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్ట్‌తో ‘ఓ బేబీ’ తెరకెక్కింది. సమంత వృద్ధురాలయ్యాక ప్రముఖ నటి లక్ష్మి పాత్రలో కనిపిస్తారు. మాస్టర్‌ తేజ మనవడిగా కన్పించనున్నారు. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. నాగశౌర్య కీలక పాత్రను పోషించారు. జులై 5న ఓ బేబీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బేబీ మిమ్మల్ని అస్సలు డిస్సాయింట్ చేయదు. మంచి వినోదాన్ని పంచుతుంది. ప్రత్యేకంగా మహిళలకు బాగా నచ్చుతుంది. అసలు నాతో ఎంజాయ్ మెంట్ మాములుగా ఉండదు. చూస్తారుగా’ అని ప్రీ-రిలీజ్ వేడుకలో సామ్ తెలిపింది.