బన్నీ దర్శకుడితో హవీష్ సినిమా


స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ స్ట్రయిట్ తమిళ్ సినిమా చేయాలని చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. దర్శకుడిగా లింగుస్వామిని ఎంచుకొన్నాడు. చెన్నై వెళ్లి సినిమాపై ప్రకటన కూడా చేసొచ్చారు. తెలుగు, తమిళ్ ద్విబాషా చిత్రంగా తీసుకొస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఆ సినిమా అప్ డేట్స్ లేవు. ‘డీజే-దువ్వాడ జగన్నాథ్’ తర్వాతే బన్నీ లింగుస్వామి సినిమా చేయాలి. కానీ, ఆ సినిమాని పక్కనపెట్టేసి ‘నా పేరు సూర్య’ సినిమా చేశారు. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొన్న బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీ.

ఈ నేపథ్యంలో బన్నీ లింగుస్వామిని వదిలేసినట్టే. దీంతో లింగుస్వామి మరో తెలుగు హీరోని వెతుకొన్నాడు. అతడే హవీష్. హవీష్ తో లింగుస్వామి ఓ సినిమా ప్లాన్ చేసుకొన్నట్టు సమాచారమ్. తెలుగు, తమిళ భాషల్లో, ఇరుభాషల నటులను కలిపి, ఓ ద్విభాషా చిత్రానికి లింగుస్వామి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో హవీష్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలిసింది. ఈ సినిమా బన్నీ కోసం రాసుకొందా ? లేక మరో కొత్త కథనా ?? అన్నది స్వయంగా లింగుస్వామియే క్లారిటీ ఇస్తే మంచిదేమో. లేదంటే.. బన్నీ కథతో హవీష్ సినిమా రాబోతుందని భావించాల్సి ఉంటుంది. ఇక, ఇటీవలే విడుదల హవీష్ ‘సెవెన్’ యావరేజ్ సినిమా అనిపించుకొంది.