‘వెంకీమామ’ కాదు ‘కంసమామ’

మేనల్లుడు నాగచైతన్యతో వెంకటేష్ కు గండం ఉందట. వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. ఈ సినిమాకు భాగవతం పురాణంలోని ఓ పాయింట్ ఆధారం. అదే మామకు అల్లుడి వల్ల గండం అన్న జ్యోతిష్యం పాయింట్. కంసమామ పాయింట్ అని తెలిసింది. ఈ పాయింట్ ను చాలా ఫన్నీగా చూపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారమ్.

ఈ సినిమాకు కోన వెంకట్, జనార్థన మహర్షి, డైరక్టర్ రవీంద్ర కలిసి పనిచేసారు. కంసమామ, మేనల్లుడు కృష్ణుడి పాలిట విలన్. ఇక్కడ వెంకీ మామ అలా కాదు. కానీ, రెండింటికీ కామన్ పాయింట్, మామకు అల్లుడి వల్ల గండం వుంటుంది అన్న జ్యోతిష్యం పాయింట్ అని తెలుస్తోంది. అంతేకాదు.. ప్రభాస్-రాధాకృష్ణల ‘జాను’ సినిమా పాయింట్ కూడా జ్యోతిష్యంతో ముడిపడిన పాయింట్ అని తెలుస్తోంది.