త్వరలో.. తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు !


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ ఉన్నారు. ఆయన 2009 నుంచి కొనసాగుతూ వస్తున్నారు. విభజన చట్టం ప్రకారం పదేళ్లకు మించకుండా ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున ఇన్నాళ్లు ఒకే గవర్నర్‌ను కొనసాగిస్తూ వస్తున్నారు. పదేళ్లకు పైగా కొనసాగుతున్న నరసింహన్ ని ఇంకా కొనసాగించడం బాగుండదన్న ఉద్దేశంతో హోంశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీగాక, రెండు రాష్ట్రాలు పూర్తిగా వాటి భూభాగాల నుంచి పరిపాలన సాగిస్తుండటం, హైకోర్టు కూడా వేరుపడిన నేపథ్యంలో గవర్నర్లను వేరుగా నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి కేంద్రం వచ్చినట్లు చెబుతున్నారు.

త్వరలోనే రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్ల నియమాకం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బహుశా.. పార్లమెంటు సమావేశాల తర్వాత నియామకం జరగొచ్చు. విజయవాడలో ఇదివరకు ముఖ్యమంత్రి ఆఫీసుగా ఉన్న కార్యాలయాన్ని గవర్నర్‌ కార్యాలయంగా తీర్చిదిద్దే పనులు జరుగుతున్నందున అందులో గవర్నర్‌ కొలువుతీరే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు చానాళ్ల నుంచి గవర్నర్ ని మార్పుని కోరుకొంటున్నారు. త్వరలోనే అది జరగనుందని కేంద్ర హోంశాఖ వర్గాల సమాచారమ్.